ఏటూరునాగారాన్ని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించేందుకు ప్రభుత్వం పచ్చజెండా

-

వరంగల్‌ జిల్లా ఏటూరునాగారం ప్రజల చిరుకాల వాంఛ నెరవేరింది. ఏటూరునాగారాన్ని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించేందుకు 15 రోజుల గడువు విధించింది. 2019 ఫిబ్రవరి 17వ తేదీన.. 9 మండలాలతో ములుగు జిల్లా ఏర్పాటైన విషయం తెలిసిందే. కొత్తగా మల్లంపల్లిని మండలంగా ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.

ఈ మండలాలన్నీ ఒక్క ములుగు రెవిన్యూ డివిజన్ పరిధిలోనే ఉన్నాయి. జిల్లాలో మొత్తం పది మండలాలు ఉండగా ఏటూరునాగారం కేంద్రంగా  తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం మండలాలు కలుపుకొని కొత్త రెవిన్యూ డివిజన్ ఏర్పాటుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏటూరునాగారం రెవిన్యూ డివిజన్ ఏర్పాటైన తర్వాత గోవిందరావుపేట, వెంకటాపూర్, మల్లంపల్లి మండలాలకు ములుగు రెవిన్యూ డివిజన్ పరిమితం కానుంది.

ఏటూరునాగారాన్ని రెవెన్యూ డివిజన్​గా ప్రకటిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేయడంతో స్థానిక ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి కేసీఆర్​కు కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు ప్రజలు కూడా కేసీఆర్​కు ధన్యవాదాలు తెలిపారు. పలుచోట్ల కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తూ ఆయనపై తమకున్న మమకారాన్ని చాటుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news