తెలంగాణ రాష్ట్రంలో గుండెపోటుతో యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం గుమ్మడవెల్లి, దేవరోనితండాకు చెందిన ఇస్లావత్ సిద్దు (20) శేరిగూడలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ ఇంజినీరింగ్ కాలేజీలో డిప్లొమా 3వ సంవత్సరం చదువుతున్నాడు.

స్నేహితులతో కలిసి ఉండగా సిద్దు గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపొగా.. తోటి విద్యార్థులు సిద్దును ఆస్పత్రికి తరలించారు.ఆస్పత్రికి వెళ్లే మార్గమధ్యలోనే సిద్దు కన్నుమూశాడు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.