రేవంత్‌రెడ్డి ఓ బ్రోకర్‌ : మంత్రి ఎర్రబెల్లి

-

కాంగ్రెసోల్లు దొంగలని, వారు పాలించే రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. బుధవారం జనగామ జిల్లా పాలకుర్తిలో గొల్లకుర్మల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. తొలుత గొల్లకుర్మలు ఒగ్గు డోలు విన్యాసాలు, బోనాలు, శివసత్తుల పూనకాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మంత్రి ఎర్రబెల్లికి మేకపిల్ల, గొంగడి బహూకరించారు.

ఈ సందర్భంగా దయాకర్ రావు మాట్లాడుతూ.. సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సంక్షేమ పథకాలు అమలు చేసిన సారథి సీఎం కేసీఆర్‌ అని అన్నారు. ఓటు అనే వజ్రాయుధాన్ని ఆలోచించి వేయాలని, తొందరపడి ఓటు వేయొద్దన్నారు. ప్రజల కోసం పని చేసే నాయకులకు మాత్రమే ఓటు వేయాలన్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్‌ పాలన లో గొల్లకుర్మలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. గొల్ల కుర్మలకు అండగా నిలిచింది సీఎం కేసీఆర్‌ అని కొనియాడారు.

గొర్రెల యూనిట్ల ను అత్యధికంగా పాలకుర్తిలో పంపిణీ చేశానన్నారు. మూడు పంటలు కావాల్నా…మూడు గంటల కరెంట్‌ కావాల్నా అని అడిగారు. టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి బ్రోకర్‌ మాటలు మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. 10హెచ్‌పీ మోటర్‌ పెట్టి మూడు గంటల కరెంట్‌ ఇస్తా అని మాట్లాడడం సిగ్గుచేటని, ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. ఆపత్కాలంలో అండగా ఉన్నానని, గొల్ల కుర్మలు తనకు అండగా ఉంటే నేను వారికి అండగా నిలుస్తానన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news