జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ప్రభుత్వం విధించిన గడువులోపు విధుల్లో చేరకపోతే ఉద్యోగాలు పోతాయని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు హెచ్చరించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘మొండి పట్టుదలతో జీవితాలు ఆగం చేసుకోవద్దు. వారికి నిరసన తెలిపే హక్కు లేదు. ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించడం సరికాదు.
మీ డిమాండ్లపై సీఎం కేసీఆర్ త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటారు’ అని చెప్పారు. ఇక అటు ఇవాళ సాయంత్రం ఐదు గంటల్లోగా విధుల్లో చేరాలని ప్రభుత్వం జారీ చేసిన హెచ్చరికలను జూనియర్ పంచాయతీ కార్యదర్శులు పట్టించుకోవడం లేదు. తమకు నోటీసులు జారీ చేసిన… సమ్మెను కొనసాగిస్తామని రాష్ట్ర జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సంఘం తెలిపింది. ప్రభుత్వం ఉద్యోగాల నుంచి తొలగించిన తామంత ఏకతాటిపై నడిచి సమ్మెలోనే ఉండాలని నిర్ణయించినట్లు తెలిపింది. ప్రభుత్వం హెచ్చరికలు మాని తమను క్రమబద్ధీకరించాలని కోరింది.