బీజేపీ అధిష్టానానికి ఈటల, రాజగోపాల్ రెడ్డి అల్టిమేటం ?

-

బీజేపీ అధిష్టానానికి ఈటల రాజేందర్‌, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అల్టిమేటం ఇచ్చారు. తమకు ఏ పదవులు అవసరం లేదని బిజెపి నేత కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అనంతరం బిజెపి నేత కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. తమ అభిప్రాయాలు, సూచనలు అధిష్టానానికి చెప్పమన్నారు.

తెలంగాణలో పోరాటం ఎలా ఉండాలనే అంశంపై అమిత్ షా భరోసా కల్పించారని వివరించారు. ప్రజలకు మోదీ నాయకత్వంపై విశ్వాసం ఉందని, BRS ప్రభుత్వాన్ని గద్దె దించడం ఖాయమని స్పష్టం చేశారు. అటు.. తెలంగాణ రాజకీయ పరిస్థితులు, అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు వివరించినట్లు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలిపారు. పార్టీని బలోపేతం చేయాలని అడిగారని, అందుకు పూర్తి సహకారం అందిస్తామని చెప్పినట్లు వివరించారు. తాము కొన్ని సూచనలు చేసినట్లు చెప్పారు. బిజెపి తోనే కేసీఆర్ దోపిడి పాలనకు అడ్డుకట్ట పడుతుందని… తెలంగాణ ప్రజలు నమ్మారని తెలిపామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news