తెలంగాణ రాష్ట్రంలోని దళితలకు అదిరిపోయే శుభవార్త చెప్పారు సీఎం కేసీఆర్. దళిత బంధు రెండో విడుతకు సీఎం కేసీఆర్ అనుమతి ఇచ్చారు. దళిత బంధు రెండో విడుతకు ప్రభుత్వం అనుమతి ఇస్తూ… ఈ మేరకు జీఓ విడుదల చేసింది తెలంగాణ సర్కార్.
ఇక ఈ పథకం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి 1100 మందికి దళిత బంధు అందనుంది. ఇక ఓవరాల్ గా 118 నియోజకవర్గలలో 1,29,800 మందికి ఈ దళిత పథకం వర్తించనుంది. నిబంధల ప్రకారం లబ్ధి దారులను ఎంపిక చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల… దళితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.