కాంట్రాక్ట్ ANMలను పర్మినెంట్ చేయాలి : ఈటల

-

ఇందిరాపార్క్ వద్ద  సెకండ్ ఎ.ఎన్.ఏమ్ ల ధర్నాకు మద్దతు తెలిపారు  హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రంలో కాంట్రాక్ట్ ANM లను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాలు చేస్తున్నారు. రెగ్యులర్ ఎంప్లాయీస్ కి లక్ష రూపాయలు జీతం వస్తె అదే పని చేస్తున్న కాంట్రాక్ట్ ANMలకు కేవలం 25 వేల రూపాయలు మాత్రమే  ఇస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కెసిఆర్ పదే పదే చెప్పేవారు. ప్రభుత్వమే వెట్టి చాకిరి చేయించుకుంటే ఎలా? కంచే చేను మేస్తే ఎలా?  అనేవారు. కాంట్రాక్ట్ నర్సు, కాంట్రాక్ట్ టీచర్, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇలా అందరినీ కాంట్రాక్ట్ పెడితే … ముఖ్యమంత్రి పదవి కూడా కాంట్రాక్ట్ ఇద్ధామా అని స్వయంగా కెసిఆర్ అన్నారు.చట్టాలు చేసేదే మనం..మనం  అనుకుంటే కాదా అనేవారు. మరి 10 ఏళ్ళు అవుతుంది ఎందుకు కాలేదు కేసీఆర్ గారు ప్రశ్నించారు ఈటల రాజేందర్.  

ప్రభుత్వం నాలుగు వైపులా  కడుతున్న నాలుగు కార్పొరేట్  ఆసుపత్రులు కూడా ఉచితంగా సేవ అందించవట. నిమ్స్ లాగా డబ్బులు కడితేనే వైద్యం అందిస్తారట. ఈ డిపార్ట్మెంట్ పేదవారికి సేవ చెయ్యడానికి ఉంది.  ప్రతి నిత్యం పని ఉండే డిపార్ట్మెంట్ అని..  రోజు రోజుకు జనాభా పెరుగుతుంది,  రోగులు పెరుగుతున్నారు, పని పెరుగుతుంది. వీరి జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు ఈటల.  ప్రభుత్వం పెట్టిన బెల్ట్ షాపులు వల్ల లీవర్ డ్యామేజ్ అవుతున్న వారి సంఖ్య రోజు రోజుకు ఎక్కువ అయిందన్నారు. వైద్య శాఖలో పని చేస్తున్నా కూడా.. అమ్మ నాన్నకు కూడా వైద్యం చేయించలేని దుస్థితి వీరిది అని పేర్కొన్నారు. పిల్లలకు ఏదన్నా అయితే పుస్తెల తాల్లు కాళ్ళమీద పెట్టీ వైద్యం చేయించుకునే దయనీయమైన పరిస్థితి అన్నారు.  

Read more RELATED
Recommended to you

Latest news