బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే లాభం లేదు – ఈటల రాజేందర్

-

బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే లాభం లేదన్నారు ఈటల రాజేందర్. చెంగిచెర్ల, శివ దుర్గ కాలనీలో బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌లో పాల్గొన్న ఈటల రాజేందర్…ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విద్య సాగర్, అమరేంద్ర రెడ్డి, కప్పరా ప్రసాద్, సుదర్శన్ రెడ్డి, గొనె శ్రీనివాస్, మహేష్, పవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ… గత ఎంపీ రేవంత్ రెడ్డిని ఐదేళ్లు క్రితం ప్రశ్నించే గొంతు అని ప్రజలు భావించి పార్టీ బలహీనంగా ఉన్నా ఓట్లు వేసి, గెలిపించారు.

Etala rajendhar on congress and BRS

కానీ ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను చూడడానికి గానీ, వారి సమస్యలు తెలుసుకోవడానికి గానీ ఆయన ఒక్కసారి కూడా రాలేదు. ఇప్పుడు ఆయన ఏకంగా తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ ప్రభుత్వం ఏర్పాటయ్యి నాలుగు నెలలైనా ఇచ్చిన ఏ హామీలను నెరవేర్చలేదు. మరి కాంగ్రెస్ పార్టీ ఏ ముఖం పెట్టుకుని మళ్లీ ఓట్లు అడగడానికి వస్తున్నారని వెల్లడించారు. ఇప్పుడున్న పరిస్థితులలో బీఆర్‌ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఏ మాత్రం లాభం లేదని… తెలంగాణలోని ఉద్యోగ అవకాశాలు, ఐటీ అభివృద్ధి, రోడ్లు, కార్యాలయాలు రావాలంటే బీజేపీ పార్టీ వల్లనే సాధ్యమని చెప్పారు. నేను నేరుగా ప్రధాని మోదీ వద్దకు వెళ్లి ఈ ప్రాంతంలోని సమస్యల పై నేరుగా చర్చించగలను. మీరందరూ విజ్ఞులు, బాగా ఆలోచించి మీ ఓటును కమలం పువ్వు గుర్తుపై వేసి గెలిపించవలసిందిగా ప్రార్థన అంటూ ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news