ఇంటర్ ఫెయిల్ అయ్యిందని విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం ఎర్రచక్ర తండాకి చెందిన స్వాతి(17) ఇటీవల వెలువడిన ఇంటర్ ఫలితాల్లో రెండు సబ్జెక్టులు ఫెయిల్ అయింది. దీంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగింది.

విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇక అటు కాశీబుగ్గకు చెందిన వరుణ్ సాయి(17) ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో మూడు సబ్జెక్టులు తప్పడంతో మనోవేదనకు గురయ్యాడు. దీంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఖిలా వరంగల్ కోటపై ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.