2014 లో అధికారంలోకి వస్తే నల్లధనాన్ని వెనక్కి తీసుకువచ్చి.. ప్రతీ ఒక్కరి ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని చెప్పి దేశ ప్రజలను ప్రధాని నరేంద్ర మోడీ మోసం చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎన్నో హామీలను ఇచ్చి వాటిని అమలు పరచడంలో బీజేపీ విఫలమైందని , దేశంలో ఏ సమస్య వచ్చినా వాటి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు చైనా, పాకిస్థాన్, దేవుళ్ల పేర్లు చెప్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశాన్ని విభజించేందుకు బీజేపీ, మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే.. ఏకం చేయడానికి రాహుల్ గాంధీ యాత్రలు చేస్తున్నారని తెలిపారు.
ప్రజలంతా బాగుండాలని రాహుల్ గాంధీ యాత్ర చేస్తున్నారని , ప్రజలకు న్యాయం కోసం యాత్ర చేస్తున్నారని , యువత, మహిళ, దళిత, గిరిజన ప్రజల కోసం ఆయన కష్టపడుతున్నారని రాహుల్క సేవలను కొనియాడారు.గతంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌కు భారత్ జోడో యాత్ర నిర్వహించగా.. ప్రస్తుతం మణిపూర్ నుంచి భారత్ జోడో న్యాయ్ యాత్రను చేపట్టారని గుర్తు చేశారు. మోడీ దేశానికి ఏం చేశారని ప్రశ్నించారు. వీటన్నిపై రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో మోడీ అన్ని హామీలపై ప్రశ్నిస్తామని అన్నారు. దేశంలో రైతులకు పనులు లేవు , యువతకు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని , పనిలేకపోతే తిండి ఎలా దొరుకుతుందని ప్రశ్నించారు.