హామీలు ఇచ్చి తప్పించుకునే రోజులు పోయాయి అని ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే పేర్కొన్నారు. ఇవాళ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన తెలంగాణ కాంగ్రెస్ బూత్ లెవెల్ కన్వెన్షన్” కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే హాజరయ్యారు. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అందరూ సమిష్టి కృషి చేయాలని పార్టీ నేతలకు సూచించారు.
ఈ సమావేశంలో మాట్లాడుతూ ప్రధాని మోడీపై నిప్పులు చెరిగారు. రెండు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో బూత్ ఏజెంట్ల బాధ్యత అత్యంత కీలకమైన పని ఉందని కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మీరు చేసిన కృషి ఫలితంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని , ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలలో రెండు ఇప్పటికే అమలుపరిచామని , మిగిలినవి కూడా ఇచ్చిన మాట ప్రకారమే అమలు చేసేపనిలో ఉన్నామని ఖర్గే అన్నారు. కానీ .. మోడీ మాత్రం గతంలో మోడీ గ్యారంటీ అని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు.రెండు కోట్ల ఉద్యోగాల గ్యారంటీ అన్నారు .. ఏమయ్యాయి ఈ హామీలని నిప్పులు చెరిగారు.