తెలంగాణలో పలు చోట్ల మొరాయిస్తున్న ఈవీఎంలు.. ఆగిపోయిన పోలింగ్ !

-

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రారంభమైంది. అయితే కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. సూర్యాపేట బూత్ నంబర్ 89, బాసర 262 బూత్, లక్సెట్టిపేట 83వ బూత్, మెదక్ జిల్లా ఎల్లాపూర్, కరీంనగర్ లో 371వ నంబర్ బూతులో ఈవీఎంలు పనిచేయట్లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని 182 వ బూత్ లో 40 నిమిషాల నుంచి ఈవీఎం మొరాయిస్తోంది.

EVMs are barking in many places in Telangana

పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఈవీఎం పని చేయలేదు. బూతులో ఇప్పటివరకు ఒక ఓటు వేయని పరిస్థితి అక్కడ నెలకొంది. సిరిసిల్ల నియోజకవర్గం లో పోలింగ్ కేంద్రం 114 లో మాక్ పోలింగ్ సమయంలో EVM లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో దాని స్థానంలో మరొకటి ఏర్పాటు చేశారు. ఇక ఓటు వేసేందుకు ప్రజలు బారులు తీరగా…..ఆయా ప్రాంతాల్లో పోలింగ్ ఆలస్యం అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version