త్వరలో తెలంగాణ కేబినెట్ విస్తరణ జరుగనుందది. బడ్జెట్ సమావేశాల్లోపు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న 6 ఖాళీల్లో ఎవరికి స్థానం దక్కుతాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
రేసులో బాలు నాయక్, జి. వివేక్, వాకిటి శ్రీహరి, ఈర్లపల్లి శంకర్, సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్, అజారుద్దీన్, మదన్ మోహన్ రావుతో పాటు రాహుల్ గాంధీ సిఫార్సుతో బల్మూరి వెంకట్ పేర్లు వినిపిస్తున్నాయి.
ఇది ఇలా ఉండగా, తాజాగా ప్రభుత్వ సలహాదారులను నియమించింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వ సలహాదారులుగా వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ ఆలీ, హరకర వేణుగోపాల్ నియామకం అయ్యారు.ముగ్గురు ప్రభుత్వ సలహాదారులను నియమించిన ప్రభుత్వం.. ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవి నియామకం చేసింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే.. సీఎం రేవంత్ రెడ్డి సలహా దారులుగా వేం నరేందర్ రెడ్డి నియామకం అయ్యారు.