హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గగన్ పహాడ్ లోని ఓ బేకరీ కిచెన్ లో సిలిండర్ పేలింది. ఈ ఘటనలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారందరినీ స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు తెలుసుకున్నారు.
గాయపడిన వారి వివరాలు, ప్రమాదం ఎలా జరిగిందనే విషయం తెలియాల్సి ఉంది. బేకరీలో పనిచేసేవారు మాత్రమే గాయపడ్డారా? లేక కస్టమర్లు కూడా ఉన్నారా? అనే విషయంపై స్పష్టత రావాల్సిఉంది. గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరాతీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. వారిని తక్షణమే డి.ఆర్.డి అపోలో ఆసుపత్రికి తరలించాలని అధికారులకు సూచించారు.