చంపేస్తాం అంటూ పూజా హెగ్డే కు వార్నింగ్..క్లారిటీ ఇచ్చిన బ్యూటీ..!

-

ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్ లలో పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఈ ముద్దుగుమ్మ కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ భాషల్లో కూడా నటించి మంచి నటిగా గుర్తింపు పొందింది. తన అందచందాలతో పాటు నటనతో కూడా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది.
పూజా హెగ్డే మొదటిసారిగా నాగచైతన్య నటించిన ఒక లైలా కోసం సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది ఆ తరువాత వరుస సినిమాలతో అగ్ర హీరోలతో నటించి మంచి అవకాశాలను సంపాదించుకుంది.

పూజా హెగ్డే గత రెండు సంవత్సరాల నుండి ఈమె నటించిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాపులు అవుతున్నాయి. అయితే, హీరోయిన్ పూజ హెగ్డేను చంపేస్తామని కొందరు వ్యక్తులు బెదిరించారు అంటూ వస్తున్న వార్తలపై ఆమె టీం క్లారిటీ ఇచ్చింది. “అసలు ఇలాంటి తప్పుడు వార్తలను ఎందుకు ప్రచారం చేస్తారో తెలియదు. ఇందులో ఎలాంటి నిజం లేదు. దయచేసి ఇలాంటి అవాస్తవాలను నమ్మకండి” అని వెల్లడించింది. కాగా, ఇటీవల పూజ ఓ కార్యక్రమానికి వెళ్లగా…. అక్కడ పెద్ద గొడవ జరిగిందని, దీంతో ఆమెను చంపేస్తామంటే కొందరు వార్నింగ్ ఇచ్చారని ప్రచారం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news