ఎమ్మెల్సీ కవిత జ్యూడిషియల్ రిమాండ్ పొడగింపు..

-

ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ కవితపై ఈడీ దాఖలు చేసిన చార్జీషీట్ ని పరిగణలోకి తీసుకోవడంపై నేడు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే కేసుకు సంబంధించి 8 వేల పేజీల సప్లింమెంటరీ చార్జీషీట్ను ఈడీ అధికారులు కోర్టుకు సమర్పించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు కవిత జ్యుడీషియల్ రిమాండ్ను ఈ నెల 20 వరకు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, కవితను ఈ సారి ఈడీ అధికారులు నేరుగా కోర్టుకు తీసుకురాకుండా వర్చువల్గా విచారణకు హాజరుపరిచారు. అదేవిధంగా కవిత చార్జీషీట్ పరిగణలోకి తీసుకోవడంపై విచారణను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మే 20కి వాయిదా వేసింది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ, ఈడీ తనపై నమోదు చేసిన కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 6న కొట్టివేసింది. తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్లలో కవిత ఒక్కరని ఒకరని ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని కవిత తరపు లాయర్లు కోర్టును కోరారు. అదేవిధంగా, మహిళగా పీఎంఎల్ఎ సెక్షన్-45 ప్రకారం బెయిల్ పొందే అర్హత ఆమెకు ఉందని బెయిల్ ఇవ్వాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news