ఏపీ అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సోమవారం పల్నాడు, చంద్రగిరి సహా పలు చోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. రాళ్లు, కర్రలతో దాడులు, అంతటితో ఆగకుండా పెట్రోల్ బాంబులతో దాడులు ఏపీలో ఎన్నికల వాతావారణాన్ని ఒక్క సారిగా వేడెక్కించాయి. అయితే ఈ దాడుల ఘటనపై టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా స్పందించారు.
‘నిన్నటి పోలింగ్ లో వైసీపీ గూండాల దాడులను ధైర్యంగా ఎదిరించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ప్రజలపై పోలింగ్ అనంతరం కూడా వైసీపీ రౌడీలు దాడులకు తెగబడుతున్నారు పల్నాడు, చంద్రగిరి సహా పలుచోట్ల ఇప్పటికీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండటం ఆందోళనకరం. ఈసీ, పోలీసు ఉన్నతాధికారులు రాష్ట్రంలో శాంతి భద్రతలను పునరుద్ధరించడం పై దృష్టి పెట్టాలి హింసను ప్రేరేపిస్తున్న శక్తులపై కఠినంగా వ్యవహరించి ప్రజలకు రక్షణ కల్పించాలి.’ అని ట్వీట్ చేశారు.