ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను కలిసిన తల్లి శోభ

-

దిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్టయి ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను గురువారం సాయంత్రం ఆమె తల్లి శోభ, సోదరుడు కేటీఆర్‌, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌ కుమార్‌ సోదరి సౌమ్య కలిశారు. కోర్టు ఇచ్చిన అనుమతి ప్రకారం సాయంత్రం 7 నుంచి 8 గంటలవరకు వారు ఆమెతో మాట్లాడారు. ఈ సందర్భంగా కవిత యోగక్షేమాలు, ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆరు రోజులుగా ఆమె ఈడీ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఉత్తర్వుల ప్రకారం శనివారం మధ్యాహ్నం ఆమెను ఇక్కడి రౌజ్‌ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరచాల్సి ఉంది.

మరోవైపు ఇదే కేసులో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను కూడా ఈడీ అరెస్టు చేసింది. గురువారం రోజున కేజ్రీవాల్ ఇంటికి వెళ్లిన అధికారులు చాలా సేపటి వరకు సోదాలు నిర్వహించి ఎట్టకేలకు అరెస్టు చేశారు. అనంతరం ఆయణ్ను ఈడీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. ఈడీ కేంద్ర కార్యాలయ ప్రాంతాన్ని పోలీసులు  అదుపులోకి తీసుకున్నారు. దిల్లీ స్పెషల్ సీపీ మధు తివారీ నేతృత్వంలో భద్రత ఏర్పాట్లు చేశారు. ఈడీ కార్యాలయానికి వచ్చే మార్గాలన్నింటిని మూసివేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version