తెలంగాణ వ్యాప్తంగా 7,149 ధాన్యం కొనుగోలు కేంద్రాలు

-

తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఇప్పటికే యాసంగి వరికోతలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా రబీ (యాసంగి) ధాన్యం కొనుగోలు చేసేందుకు 7,149 కేంద్రాలు ఏర్పాటు చేయనుంది. గతేడాది తెరిచిన కొనుగోలు కేంద్రాలు 7,037తో పోలిస్తే ఈసారి అదనంగా మరో 112 కేంద్రాల్లో కొనుగోళ్లు చేపట్టనున్నట్లు సమాచారం.

జిల్లాలవారీగా చూస్తే అత్యధికంగా నిజామాబాద్‌ జిల్లాలో 466 కేంద్రాలు, ఆ తర్వాతి స్థానంలో సిద్దిపేట, జగిత్యాల, మెదక్‌ జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. వరి సాగుపరంగా నిజామాబాద్‌ తొలి స్థానంలో ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట జిల్లాలున్నాయి. గతేడాది కన్నా ఈసారి అదనంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే జిల్లాల్లో కొన్నింటిని పరిశీలిస్తే.. నల్గొండలో 24, నాగర్‌కర్నూల్‌లో 23, గద్వాలలో 19 పెరిగే అవకాశం ఉంది. రబీలో 66.06 లక్షల ఎకరాల్లో వరి సాగవ్వగా.. 120.92 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version