నీరు లేక పంట ఎండిపోవడంతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. భూపాలపల్లి జిల్లా టేకుమట్ల, బూర్నపల్లికి చెందిన రైతు కొండ రమేష్ (44) తనకున్న రెండెకరాల భూమిలో వరి సాగు చేశాడు. కానీ, చివరి దశలో నీరు అందకపోవడంతో మొత్తం పంట ఎండి పోయి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.
చాలా పెట్టుబడి పెట్టి నష్టపోయిన రైతు రమేష్ తీవ్ర మనోవేదనకు గురై తన పొలం సమీపంలోని బూర్నపల్లి గుట్టకు వెళ్లి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.