కేంద్రానికి రైతుల షాక్.. మీ భోజనం కూడా వద్దు !

-

రైతు సంఘాల నేతలతో ముగ్గురు కేంద్ర మంత్రులు చర్చలు సాగుతున్నాయి. రైతు సంఘాల నేతలతో ఈ కేంద్రం చర్చలు సుదీర్ఘంగా కొనసాగుతున్నాయి. దాదాపు నాలుగున్నర గంటలుగా ఈ చర్చలు సాగుతున్నాయి. కనీస మద్దతు ధరపై రాతపూర్వక హామీ ఇచ్చేందుకు కేంద్రం ప్రతిపాదన చేయగా దానికి రైతు సంఘాలు తిరస్కరించినట్టు తెలుస్తోంది. కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందేనని రైతు సంఘాలు స్పష్టం చేసినట్టు చెబుతున్నారు. అంతే కాదు  ప్రభుత్వం ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజనాన్ని సైతం రైతు సంఘాల నేతలు తిరస్కరించినట్టు సమాచారం.

చర్చల సందర్భంగా కేంద్రం పెద్దలతో కలిసి భోజనం చేసేందుకు తిరస్కరించిన రైతులు బయట నుంచి తమ కోసం ప్రత్యేకంగా తమ క్యాంప్ నుండి భోజనం తెప్పించుకున్న రైతు సంఘాల నేతలు వాటితోనే భోజనం పూర్తి చేశారు. ఇక లంచ్ బ్రేక్ తర్వాత ప్రభుత్వ వాదనలను కేంద్ర మంత్రులు—-వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి పియూష్ గోయల్  వినిపిస్తున్నారు. ఈ బ్రేక్ వరకు సమావేశంలో అభ్యంతరాలు, అనుమానాలు, భయాలను వ్యక్తం చేస్తూ రైతు సంఘాల నేతలు మాట్లాడారు. ఈ లంచ్ బ్రేకు తర్వాత వారి అభంత్రాల మీద ప్రభుత్వ వాదనలను కేంద్ర మంత్రులు వినిపిస్తున్నారు. 

 

Read more RELATED
Recommended to you

Latest news