BREAKING : హబ్సిగూడ,అత్తాపూర్ లో అగ్నిప్రమాదాలు..ఎగిసి పడుతున్న మంటలు

-

BREAKING : హైదరాబాద్‌ నగరంలో ఈ మధ్య కాలంలో వరుసగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా హైదరాబాద్‌ లోని హబ్సిగూడలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హబ్సిగూడలోని అన్ లిమిటెడ్ షో రూమ్ లో ఈ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

ఇక ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు అర్పుతున్నారు. అన్ లిమిటెడ్ షో రూమ్ సమీపంలోనే పెట్రోల్ బంక్ ఉంది. దీంతో ఏం జరుగుతుందోనని స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఇక అటు భారీగా మంటలు, పొగలు ఎగిసి పడుతున్నాయి. ఇక అటు అత్తాపూర్ హసన్ నగర్ లో కూడా భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బట్టల గోదాంలో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ వ్యాపించడంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు స్థానికులు.

Read more RELATED
Recommended to you

Latest news