యాదాద్రిలో ఘోర అగ్ని ప్రమాదం…దట్టమైన పొగలు

-

యాదాద్రిలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదం నేపథ్యంలో దట్టమైన పొగలు వ్యాపిస్తున్నాయి. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లం బావి గ్రామంలో ఉన్న ఉన్న ఓజో ఫర్టిలైజర్ పరిశ్రమలో అర్ధరాత్రి తర్వాత అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. భారీగా మంటలు, దట్టమైన పొగ వ్యాపించడంతో అప్రమత్తమైన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.

Fire broke out in the Ojo industry of Ellam Bavi in ​​Chautuppal Mandal

రంగంలోకి దిగిన ఆరు ఫైర్ ఇంజన్లు తీవ్రంగా శ్రమించిన అనంతరం మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. షార్ట్ సర్క్యూట్ ఈ అగ్ని ప్రమాదానికి కారణం కావచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రమాదంలో ప్రాణ నష్టం జరగలేదు.. కానీ భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు యాజమాన్యం చెప్తోంది. అర్ధరాత్రి ప్రమాదం జరగడం… ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు, సిబ్బంది ఎవరూ పరిశ్రమ లో లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news