కొత్త సినిమా టికెట్‌ ధరల పెంపుపై లోతైన విచారణ: ఏపీ హైకోర్టు

-

కొత్త సినిమాల టికెట్‌ ధరల పెంపుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. టికెట్ ధరలు పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా.. లేదా.. అనే విషయాన్ని తేలుస్తామని చెప్పింది. ఈ వ్యవహారంపై లోతైన విచారణ చేస్తామని పేర్కొంది. పూర్తి వివరాలతో కౌంటర్‌ వేయాలని ప్రభుత్వాన్ని, ఇతర ప్రతివాదులను ఆదేశించింది. సినిమా టికెట్‌ ధరల విషయంలో గతంలో దాఖలైన వ్యాజ్యంతో ప్రస్తుత పిల్‌ను జత చేయాలని రిజిస్ట్రీకి స్పష్టం చేసింది.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కల్కి సినిమా టికెట్ల ధరలను 14 రోజులపాటు పెంచుకునేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మెమోను సవాలు చేస్తూ పి.రాకేశ్‌ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం విచారణ చేపట్టగా.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్‌.ప్రణతి వాదనలు వినిపిస్తూ పూర్తి వివరాలతో కౌంటర్‌ వేసేందుకు మరికొంత సమయం కావాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news