ఎన్టీఆర్ స్టేడియంలో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ : మంత్రి తలసాని

-

ఎన్టీఆర్ స్టేడియంలో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుందని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రకటించారు. నేటి నుంచి నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో భాగంగా ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ను నిర్వహించనున్నట్లు మంత్రి శ్రీనివాస యాదవ్ తెలిపారు.

ఎన్టీఆర్ స్టేడియంలో ఈనెల 8, 9, 10వ తేదీల్లో నిర్వహించనున్న ఫిష్ ఫెస్టివల్ ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలోనే కార్యక్రమాల షెడ్యూల్ ను విడుదల చేసిన ఆయన పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

కాగా, తెలంగాణ రాష్ట్రం నేటితో 9 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సరిగ్గా ఇదే రోజు 2014 జూన్ 2న దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో 1969లో ఉవ్వెత్తున ఎగిసిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం… ఎన్నో పోరాటాల తర్వాత సాకారం అయింది. విద్యార్థుల ఆత్మబలిదానాలు, మిలియన్ మార్చ్, సకలజనుల సమ్మె, బందులు…అంటూ అన్ని వర్గాలు ముందుండి పోరాడాయి.

Read more RELATED
Recommended to you

Latest news