గ్రూప్ 1 అభ్యర్థుల కోసం..సుప్రీం కోర్టులో వాదించబోతున్నారు బీఆర్‌ఎస్ పార్టీ నేత, ఉద్యమకారుడు దాసోజు శ్రవణ్. ఈ మేరకు లాయర్ గెటప్ వేసుకుని.. సోషల్ మీడియాలో ప్రకటించారు. ఇవాళ గ్రూప్ 1 అభ్యర్థుల కోసం..సుప్రీం కోర్టులో వాదించబోతున్నట్లు ప్రకటించారు. ఇది ఇలా ఉండగా… ఇవాల్టి నుంచి గ్రూప్ వన్ పరీక్షలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న సంగతి తెలిసిందే. అభ్యర్థులు ఎన్ని నిరసనలు తెలిపిన కూడా… జీవో 29 రద్దు చేసేది లేదని రేవంత్ రెడ్డి సర్కార్ ముందుకు వెళ్తోంది. ఇవాల్టి నుంచి పరీక్షలు కూడా నిర్వహించనుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.
అటు గ్రూప్-1 పరీక్షలు వాయిదా వేయాలని నిరుద్యోగులు, అభ్యర్థులు గతంలో దాఖలు చేసిన పిటీషన్లను ఇవాళ విచారించనుంది సుప్రీంకోర్టు న్యాయ స్థానం. జీవో 29 పైనే ప్రధానంగా ఇవాళ న్యాయస్థానంలో వాధనలు జరుగుతాయని, వారికి న్యాయం జరుగుతుందని అనేక ఆశలు పెట్టుకుంటున్నారు తెలంగాణ నిరుద్యోగులు. ఓవైపు విద్యార్థుల ఆందోళనలు, మరోవైపు ప్రభుత్వం ఇవాల్టి నుంచి పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ తరుణంలోనే.. సుప్రీం కోర్టు తీర్పు ఎలా వస్తుందనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.