ఇకపై ట్రాపిక్ నిబంధనలకు విరుద్ధంగా నడుచుకున్న వాహనదారులపై నజర్ వేసే ప్రయత్నాలు మొదలు పెట్టారు ట్రిఫిక్ పోలీసులు. సాధారణంగా మనం ట్రాఫిక్ పోలీసులు చలానాలు విధించడం చూస్తూనే ఉంటాం. కానీ, చాలా మంది ఏళ్లు గడిచినా.. సదరు చలనాలు కట్టకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే దీనిపై స్పందించిన మాదాపూర్ ట్రాఫిక్ సీఐ శ్రీనివాసులు ఓ విషయాన్ని తెలిపారు. ఆ వివరాలు తెలుసుకుందాం.
మామూలుగా హెల్మెట్ ధరించని సమయంలో..రాంగ్ సైడ్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ వంటి నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించే వాహనానికి చలానాలు పడుతుంటాయి. ఇటువంటి వాహనదారులు నిబంధనలు అతిక్రమిస్తే చలానాల విషయంలో అలసత్వం, నిర్లక్ష్యం అస్సలు తగదు. వెంటనే చలానాలు కట్టేయాల్సిందే. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎందుకంటే ఒక్క చలానా పెండింగ్ లో ఉన్నా నిబంధనల ప్రకారం వాహనాన్ని సీజ్ చేయొచ్చట.
గత ఆదివారం పర్వత్ నగర్ చౌరస్తాలో నిఖిలేష్ అనే న్యాయవాది బైక్ ను ఈ విధంగానే సీజ్ చేశారు. కేవలం ఒక చలానా పెండింగ్ ఉందని మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు బైక్ ని సీజ్ చేశారు.
ఆ బైకుపై రూ.1650 చలానా పెండింగ్ ఉందని, చెల్లించాలని ఎస్‌ఐ మహేంద్రనాథ్ కోరారు. చలనా కట్టేందుకు న్యాయవాది నిరాకరించారు. దీంతో పోలీసులు బైక్ ను సీజ్ చేశారు.
అంటే .. ఒక్క చలానా పెండింగ్ ఉన్నా వాహనాన్ని సీజ్ చేయొచ్చని తెలిపారు. కాబట్టి వాహనదారులు అలర్ట్ అవ్వాల్సిన సమయం ఇది. చలానాలు కట్టకుండా అలసత్వం వహిస్తే.. మీ వాహనం సీజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వాహనదారులు మీ బండిపై ఏౖమైనా చలాన్లు పెండింగ్ లో ఉన్నాయే చెక్ చేసుకొని, వెంటనే మీకు దగ్గర్లో ఉన్న మీ సేవా సెంటర్ కి వెళ్లి కట్టేయండి.