మాజీ సీఎం కేసీఆర్‌కు హైకోర్టులో ఊరట లభించింది. 2011 తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌పై నమోదు అయిన రైలు రోకో కేసుల్లో స్టే విధించింది హై కోర్టు. అంతేకాదు… ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. ఇవాళ 2011 రైల్ రోకో కేసుల్లో కేసీఆర్‌పై విచారణకు హైకోర్టు స్టే ఇచ్చింది.
అంతేకాదు.. ఈ విచారణ వచ్చేనెల 18కి వాయిదా వేసింది కోర్టు. తాను రైల్ రోకోలో పాల్గొనలేదన్న కేసీఆర్… తనపై అక్రమ కేసు పెట్టారంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ తరుణంలోనే.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది హైకోర్టు.
ఇక అటు మాజీ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మాజీ సీఎం కేసీఆర్ పిలుపు ఇచ్చారు. ఈ మేరకు ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కు రావాలని ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ సమాచారం అందించింది.. తాజా రాజకీయ పరిస్థితులపై ఎమ్మెల్యేలతో చర్చించనున్నారు కేసీఆర్. దీంతో బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కు బయలు దేరారు.