హూజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కొద్ది సేపటి క్రితం అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ జిల్లా వీణవంకలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు కౌశిక్ రెడ్డి ఇంటి ముందు భారీ బందోబస్తు నిర్వహించారు. కౌశిక్ రెడ్డి అరెస్ట్ తరువాత మంత్రి పొన్నం ప్రభాకర్ కి సంచన సవాల్ విసిరారు.
ముఖ్యంగా రూ.100 కోట్ల అవినీతి చేయలేదని ప్రమాణం చేయాలన్నారు. తాను అవినీతి చేయలేదని దేవుడిపై ప్రమాణం చేస్తానని కౌశిక్ రెడ్డి అన్నారు ఫ్లైయాష్ తో పాటు ఓవర్ లోడ్ లారీలను ఎందుకు అపడం లేదన్నారు. ఓవర్ లోడ్ లారీల నుంచి ఒక్క రుపాయి తీసుకోలేదని పొన్నం ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి పొన్నం ప్రమాణం చేస్తే తాను క్షమాపణ చెప్తా అన్నారు. తాను ఎలా నిజాయితీని నిరుపించుకున్నానో అలాగే పొన్నం నిరూపించుకోవాలన్నారు. అయితే పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నారు.