రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కి మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు సన్ ప్లవర్ రైతుల సమస్యలను మంత్రి తుమ్మలకు వివరించారు. అంతేకాదు.. సన్ ప్లవర్ రైతులను ఆదుకోవాలని ఆయిల్ ఫాం రైతులను ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట నియోజకవర్గంలో సన్ ప్లవర్ రైతులు ఆందోళనలో ఉన్నారని.. కొనుగోలు కేంద్రాలు కొనసాగించాలని మంత్రిని హరీశ్ రావు కోరారు. అలాగే తన దృష్టికి వచ్చిన చిన్న కోడూరు మండల రైతుల సమస్యను ఫోన్ ద్వారా మంత్రి దృష్టికి తీసుకెల్లారు.
సిద్దిపేట నియోజకవర్గంలో చిన్నకోడూరు మండలంలోని రైతులు 18వేల క్వింటాళ్లు పీఏసీఎస్ ద్వారా రెండు వేల క్వింటాళ్లు మార్కెట్ కమిటీ ద్వారా కొనుగోలు చేశారని తెలిపారు. ఇంకా 11వేల క్వింటాళ్లు మిగిలి ఉన్నాయని.. రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని వెంటనే కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.