రుణమాఫీ మార్గదర్శకాలపై మాజీ మంత్రి హరీష్ రావు సంచలన కామెంట్స్

-

రుణమాఫీ విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు చూస్తే, రైతుల వలపోతల కంటే వడపోతల పైనే ఎక్కువ దృష్టి పెట్టిందన్నది స్పష్టమైంది అని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ  “రేషన్ కార్డు ఆధారంగా తీసుకుంటాం, ఒక కుటుంబంలో ఒక్కరికే రుణ మాఫీ చేస్తామంటున్నారు. ఎన్నికల సమయంలో ప్రతి రైతుకు రుణ మాఫీ చేస్తా అని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి తప్పుతున్నారు.  ఎన్నికల ముందు కుటుంబానికి ఒక్కరికే అని, రేషన్ కార్డు ఉన్న వాళ్లకే అని చెబితే అయిపోవు కదా..?

ఆరోజు అందరిని ఉరుకుమన్నవ్, ఈ రోజు కొందరిని ఆగవడుతున్నవ్.. ఇది ఎక్కడి పద్ధతి? బ్యాంకులు పాస్ బుక్కులు చూసి రుణం ఇచ్చాయి అంతేగాని రేషన్ కార్డులు చూసి ఇవ్వలేదు బ్యాంకులకు లేని షరతు, ప్రభుత్వానికి ఎందుకు?? రుణమాఫీ గైడ్ లైన్స్ గోల్డ్ ఇచ్చే వాటి కంటే దారుణంగా ఉన్నాయి.. రేషన్ కార్డు షరతు తొలగించి, రుణాలు తెచ్చుకున్నందరికి రుణ మాఫీ చేయాలి గతంలో బిఆర్ఎస్ రుణమాఫీ చేసిన నాడు ఇలాంటి షరతులు మేం పెట్టలేదు. రైతులను రైతులుగా చూసి లక్ష రూపాయల రుణమాఫీ చేశాం” అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news