వరదల్లో 9 మంది ప్రాణాలు కాపాడిన జేసీబీ డ్రైవర్ కు మాజీ మంత్రి సన్మానం

-

వరదల్లో 9 మంది ప్రాణాలు కాపాడిన జేసీబీ డ్రైవర్ కు మాజీ మంత్రి హరీశ్ రావు, మంత్రులు జగదీశ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్  సన్మానం చేశారు. మొన్న వరదల్లో చిక్కుకున్న 9 మందిని చాలా ధైర్యం చేసి జేసీబీ సహాయంతో కాపాడిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు సన్మానించారు. నిన్ననే మున్నేరు వాగులో చిక్కుకున్న 9 మందిని ప్రాణాలకు తెగించి కాపాడిన వ్యక్తిని సన్మానించారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ వద్దిరాజు.

ప్రభుత్వాన్ని నమ్ముకుంటే పని అవదని ప్రకాష్ నగర్ వంతెన మీద చిక్కుకున్న 9 మందిని జేసీబీ సాయంతో బయటకు తీసుకొచ్చారు స్థానికులు.  జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా ఆదుకునే నాధుడే లేక పోలీసులతో వాగ్వాదానికి దిగి మరీ జేసీబీ సహాయంతో వారిని బయటకు తీసుకుని వచ్చారు.  పక్క రాష్ట్రం ఏపీ నుంచి తుమ్మల గారు తెస్తానన్న రెండు ఎలికాఫ్టర్లను వెనక్కి తీసుకుని వెళ్ళమని చెప్పమనండి అంటూ కామెంట్ చేశాడు ఓ బాధితుడు. తాజాగా హరీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయం చేయలేదని ప్రశ్నించిన తమపై దాడి చేస్తారా..? అని ప్రశ్నించారు. వరదల్లో 28 మంది చనిపోతే కేవలం 16 మంది చనిపోయారని సీఎం చెబుతున్నారని పేర్కొన్నారు. వరదలు వచ్చిన రోజు సీఎం ఎలాంటి సమీక్ష నిర్వహించలేదని మండిపడ్డారు హరీశ్ రావు.

Read more RELATED
Recommended to you

Latest news