ఎన్నికల కమిషన్ కి మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఫిర్యాదు.. నిబంధనలు ఉల్లంఘించడమే..!

-

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు కామారెడ్డిలో కూడా పోటీ చేయనున్నట్టు ప్రకటించినట్టు తెలిసిందే. సీఎం కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేయనుండడంతో  ఆగస్టు 26వ తేదీ నుంచి ప్రతీ  గ్రామ పంచాయతీలలో తీర్మానాలు చేస్తున్నారు. ముఖ్యంగా  కేసీఆర్ కి మా గ్రామ పాలక వర్గం నుండి మద్దతు అని తీర్మానం చేస్తున్నారు. ఈ తీర్మాణం  ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించడమేనని షబ్బీర్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ విషయంపై ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేస్తున్నట్టు ప్రకటించారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి..  కేసీఆర్ మెప్పు కోసం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  తీర్మానాలు చేశారు.  తీర్మాణం చేసిన సర్పంచ్ లపై ఎన్నికల కమిషన్  చర్యలు తీసుకోవాలని షబ్బీర్ అలీ కోరారు.  అదేవిధంగా కవిత పై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో సుప్రీంకోర్టు కూడా ఇలాంటి వాటిపై సీరియస్ గా స్పందించింది. అధికారులు స్పందించకపొతే… న్యాయ పరంగా వెళ్తామని స్పష్టం చేశారు షబ్బీర్ అలీ.

Read more RELATED
Recommended to you

Latest news