రేవంత్ రెడ్డికి మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ వార్నింగ్ ఇచ్చారు. పొట్టి శ్రీరాములు పేరు తొలగించడంపై టీజీ వెంకటేష్ సీరియస్ అయ్యారు. పొట్టి శ్రీరాముల పేరును తెలుగు విశ్వవిద్యాలయానికి మార్చి వేసి సురవరం ప్రతాపరెడ్డి పేరును పెట్టాలన్న తెలంగాణ కేబినెట్ తీర్మానం శోచనీయం అంటూ ఆగ్రహించారు. భాషా ప్రయుక్త రాష్టాల కోసం ప్రాణ త్యాగం చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని గుర్తు చేశారు మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్.
అలాంటి వ్యక్తి పేరును మార్చాలను కోవడం మంచి పద్దతి కాదని ఫైర్ అయ్యారు. పొట్టి శ్రీరాముల పేరును మార్చడాన్ని వెంటనే ఉప సహారించుకోవాలన్నారు. సురవరం ప్రతాప్ రెడ్డి పేరును మార్చాలనుకుంటే ఇంకో సంస్థకు పెట్టుకోండంటూ రేవంత్ సర్కార్ కు సూచనలు చేశారు. నామినేటెడ్ పోస్టులకు నేను అనర్హుడినని.. గవర్నర్ గా పనిచేయాలన్న ఆలోచన నాకు లేదని తేల్చి చెప్పారు మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్.