అభం శుభం తెలియని చిన్నారులపై లైంగికదాడులు పెరిగిపోతున్నాయి.ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై న్యాయవ్యవస్థలు కఠిన చర్యలు తీసుకుంటున్నా..కఠిన శిక్షలు విధిస్తున్నా కొందరు మనుషుల్లో మాత్రం మార్పు రావడం లేదు. మృగాళ్లలా ప్రవర్తిస్తున్నారు.ఇరుగుపొరుగు ఉండే చిన్నారులపై దాష్టీకానికి పాల్పడుతున్నారు. ఈ మధ్యకాలంలో చిన్నారులపై లైంగికదాడులు, హత్యా కేసులు విపరీతంగా పెరిగిపోయాయి.
తాజాగా సిద్దిపేట జిల్లా కొమురవెల్లి (మం) గురువన్నపేట గ్రామంలో ఓ చిన్నారిపై లైంగిక దాడి జరిగింది. ఏడవ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై గ్రామంలోని ఓ యువకుడు లైంగికదాడి చేశాడు. విషయం తెలియడంతో బాధిత కుటుంబసభ్యులు ఆగ్రహంతో ఊగిపోయారు.నిందితుడి ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. అంతేకాకుండా అతని ఇంటి బయట ఉన్న కారు,జేసీబీని బాలిక బంధువులు ధ్వంసంచేశారు.గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనడంతో పోలీసులు చెదరగొట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.