సర్వకుల మతాల సమ్మేళనమే సూర్యాపేట అని,కుల సంఘ భవనాలు ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తాయని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి చెప్పారు. జిల్లా కేంద్రమైన సూర్యాపేట లో ఈ రోజు పెరిక సదన్, ఆర్యవైశ్య భవన్, గౌడ సంక్షేమ భవన్, రెడ్డి సంక్షేమ, పి ఆర్ టి యు భవన్ తో పాటు 19 కుల, ఉద్యోగ సంఘ భవానాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కుల సంఘ ఆత్మ గౌరవ భవనాలకు బీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వం పెద్దపీట వేసినట్లు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కులవృత్తులకు పోత్రాహం అందిస్తూ అన్ని వర్గాలు ఆర్థికంగా ఎదిగే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కుల సంఘాలలో నిరుపేదలకు సంఘ భవనాలు శుభకార్యాలతోపాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించడానికి ఉపయోగపడుతాయని తెలిపారు. ప్రతి కుల సంఘాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుని కమ్యూనిటీ హాల్‌లతో పాటు సంఘ భవనాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని చెప్పుకొచ్చారు. ఇక సూర్యాపేటలో అన్ని కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి నే లక్ష్యంగా పాలన కొనసాగించామన్నారు. సూర్యాపేట నియోజకవర్గం తన కుటుంబంలో భావించి మీ అందరికీ సేవ చేస్తున్నట్లు ప్రజాసేవలో సూర్యాపేట అన్నింట్లో ఆదర్శంగా నిలిపేలా కృషి చేస్తున్నారని తెలిపారు.
ప్రతి కుల సంఘాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకొని సంఘం భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.రాబోయే రోజుల్లో పరిశ్రమలు తీసుకువచ్చి స్థానిక యువతకు ఉపాధి అందిస్తానని తెలిపారు. ఈరోజు ప్రారంభించుకున్న కుల సంఘ భవన నిర్మాణాలను అతి త్వరలో పూర్తిచేసుకుని అందుబాటులోకి తెస్తామని తెలిపారు. 2014లో మీరు వేసిన ఓటు మెడికల్ కాలేజ్, ఐటి హబ్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, నూతన ఎస్పీ, కలెక్టర్ కార్యాలయాలు, సద్దుల చెరువు మినీ ట్యాంక్ బండ్, అత్యాధునిక మహాప్రస్థానం, రహదారుల విస్తరణ, అన్నిటికీ మించి మూసి మురికి నీటి నుండి విముక్తి కల్పించిందన్నారు.