సోషల్ మీడియా కాలం వచ్చిన తర్వాత చాలామంది నేరగాళ్లు విపరీతంగా మోసాలకు పాల్పడుతున్నారు. అందులో చాలావరకు మహిళలే సైబర్ నేరగాళ్ల మోసాలకు గురి కావడం జరుగుతుంది. ఇలాంటి ఘటనలు రోజుకు చాలానే జరుగుతున్నాయి. ఉద్యోగాలు ఇప్పిస్తామని, విదేశాలకు పంపిస్తామని చాలామంది వద్ద డబ్బులను వసూలు చేస్తున్నారు. అనంతరం వారికి ఉద్యోగాలు, విదేశాలకు పంపించకపోగా వారి డబ్బులను కూడా తిరిగి ఇవ్వడం లేదు.

ఇలాంటి ఘటన జగిత్యాల అర్బన్ మండలం హుస్నాబాద్ లో చోటుచేసుకుంది. హైదరాబాద్ మహానగరంలో కొంతమంది ఏజెంట్లు అమెరికాకు పంపిస్తామని ఏకంగా ఓ మహిళ వద్ద రూ. 10 లక్షలు కాజేశారు. అమెరికాకు పంపిస్తామని చెప్పి హర్షిత అనే మహిళను మోసం చేశారు. ఆ తర్వాత వారు చేసిన మోసాన్ని తెలుసుకున్న మహిళ మరోసారి జర్మనీ వీసా కోసం ప్రయత్నించింది. అయితే వీసాల కోసం హర్షిత పెద్ద మొత్తంలో అప్పులు చేసింది. దీంతో హర్షిత కుటుంబ సభ్యులు కొన్ని రోజుల తర్వాత విదేశాలకు వెళ్ళమని నచ్చ చెప్పారు. దీంతో హర్షిత మనస్థాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలను సేకరిస్తున్నారు.