మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాకు మంత్రి పదవి ఇవ్వకపోవడానికి కారణం సమీకరణలు కుదరకపోవడమే అని అంటున్నారన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నన్ను పార్టీలోకి తీసుకున్నప్పుడు తెలియదా ఇద్దరం అన్నదమ్ములం ఉన్నామని ? అంటూ నిలదీశారు.

ఒడ్డు దాటే వరకు ఓడ మల్లన్న ఒడ్డు దాటాక బోడి మల్లన్న అన్న చందంగా ఉందని ఫైర్ అయ్యారు. 9 మంది ఎమ్మెల్యే ఉన్న ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నారని వెల్లడించారు. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్గొండకు ముగ్గురు మంత్రులు ఉండటం తప్పా? అని ఆగ్రహించారు. మా అన్నదమ్ములం సమర్థులమే, గట్టి వాళ్లమే అని వెల్లడించారు.
మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే రాజ్ గోపాల్ రెడ్డికి అన్యాయం జరిగినట్లే అని పేర్కొన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి . నాకు అన్యాయం జరిగినా పర్లేదు కానీ.. మునుగోడు ప్రజలకు అన్యాయం చేయొద్దని గత ప్రభుత్వానికి చెప్పినా ఇప్పుడు కూడా చెబుతున్నా అని పేర్కొన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.