నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్.. ఆరు యూనివ‌ర్సిటీల్లో ఫ్రీ కోచింగ్

-

తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఉద్యోగ నియామ‌కాలు చేప‌డుతామ‌ని ఇటీవ‌ల రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్.. అసెంబ్లీలో ప్ర‌క‌ట‌న చేసిన విషయం తెలిసిందే. ఈ ప్ర‌క‌ట‌న నేప‌థ్యంలో రాష్ట్రంలో కోచింగ్ సెంట‌ర్ల హడావుడు న‌డుస్తుంది. అభ్య‌ర్థుల నుంచి భారీగా ఫీజులు తీసుకుంటూ.. కోచింగ్ న‌డిపిస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వం నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ కోచింగ్ ఇస్తామ‌ని ఇప్ప‌టికే రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

తాజాగా రాష్ట్ర హోం మంత్రి స‌బితా ఇంద్ర రెడ్డి మ‌రో శుభ‌వార్త చెప్పారు. రాష్ట్రంలో ఆరు విశ్వ విద్యాల‌యాల్లో ఉచిత కోచింగ్ ఇస్తామ‌ని ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలో ఉన్న ఉస్మానియా, కాక‌తీయ, మ‌హాత్మ గాంధీ, పాల‌మూరు, తెలంగాణ‌, శాతవాహ‌న యూనివ‌ర్సిటీల్లో ఉచిత కోచింగ్ సెంట‌ర్లు ఉంట‌యాని తెలిపారు. అందు కోసం ఏర్పాట్లు చేయాల‌ని సంబంధిత అధికారుల‌ను కూడా ఆదేశించారు. నిరుద్యోగులు అన్ని పోటీ ప‌రీక్షల‌కు సిద్ధం కావాల‌ని సూచించారు. రాష్ట్రంలో అతి త్వ‌రలోనే 72 వేల ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేషన్లు జారీ అవుతాయ‌ని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news