ఏపీ విద్యార్థులకు అలర్ట్.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 6-10 తరగతుల్లో ఎక్కడ ఎక్కువ క్లాసులు చదివారన్న ఆధారంగా ‘స్థానికత’ నిర్ధారిస్తుండగా, ఇకపై విద్యార్హత స్థాయిని ఏడో తరగతికి తగ్గించింది. ఈ ప్రకారమే విద్యలో ప్రవేశాలు, ఉద్యోగ నియామకాలు కొనసాగనున్నాయి కొత్త జిల్లాల ఏర్పాటుతో చాలామంది స్థానికత కోల్పోతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రపతి ఆమోదం లభించిన వెంటనే నిర్ణయం అమల్లోకి వస్తుంది. ఇక అటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది జగన్ సర్కార్. 7న రైతు భరోసా, 28న విద్యా దీవెన విడుదల చేస్తామని ప్రకటించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఈనెల 20 తర్వాత కులగణన చేపడతామని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ వెల్లడించారు. నిన్న కేబినెట్ బేటి అనంతరం మాట్లాడుతూ…’ఈనెల 7న రైతు భరోసా సహాయం చేస్తాం. 15న నిరుపేదలకు అసైన్డ్ భూముల పంపిణీ, 22A జాబితా నుంచి ఈ నామ్ భూముల మినహాయింపు, ఎస్సీ కార్పొరేషన్ రుణాల ద్వారా భూములు కొనుగోలు చేసిన వారికి రుణాల మాఫీ చేస్తాం. 28న జగనన్న విద్యా దీవెన, 30న కళ్యాణమస్తు, శాదీ తోఫా అందజేస్తాం’ అని తెలియజేశారు.