నేడు మార్చి 1 వ తేదీ. దీంతో చాలా వస్తువుల ధరలు, అలాగే ఆన్ లైన్ ట్రాన్సక్షన్లలలో పలు మార్పులు రానున్నాయి. ఈ నేపథ్యంలోనే… ఇండియన్ బ్యాంక్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్నయం ప్రకారం.. ఇండియన్ బ్యాంక్ వినియోగ దారులు ఏటీఎంల నుంచి ఇవాళ్టి నుంచి రూ. 2 వేల నోట్లు విత్ డ్రా చేసుకోలేరు అన్న మాట.
అయితే.. వారు బ్యాంక్ కౌంటర్ నుంచి డైరెక్ట్ గా వీటిని పొందే ఛాన్స్ మాత్రం ఇండియన్ బ్యాంక్ ఇచ్చింది.ఖాతాదారులు, కస్టమర్లు ఈ రూల్స్ గుర్తించుకుకోవాలని ఇండియన్ బ్యాంక్ పేర్కొంది. ఇది ఇలా ఉండగా.. ఇవాళ్టి నుంచి టోల్ ప్లాజా నుంచి ఫాస్ట్ ట్యాగ్ కొనుగోలు చేయాలంటే వాహనదారులు రూ.100 చెల్లించాల్సి ఉంటుందని.. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటన చేసింది. అటు ఇవాళ్టి నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లు తమ ఖాతాలను యాక్టివ్ గా ఉంచుకోవాలనుకుంటే కేవైసీ పొందడం తప్పనిసరి.