ఉద్యోగానికి రాజీనామా చేసి.. రాజకీయాల్లోకి వస్తున్నా : మాజీ హెల్త్‌ డైరెక్టర్‌ గడల

-

తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ మరో సారి సంచలన కామెంట్స్ చేశారు. నా మొదటి సేవ నా మున్నూరు కాపు కులానికే చేస్తానని పేర్కొన్నారు. ఉద్యోగానికి రాజీనామా చేసి.. రాజకీయాల్లోకి వస్తున్నానని మాజీ హెల్త్‌ డైరెక్టర్‌ గడల ప్రకటన చేశారు.

Gadala Srinivas Rao into congress party

నా 25 ఏళ్ల ఉద్యోగ జీవితం రాజీనామా చేస్తున్నాను ప్రజా జీవితంలోకి రావాలి అనుకుంటున్నానని చెప్పారు. ఇప్పటికే ట్రస్ట్ ఏర్పాటు చేసి కొత్త గూడెం లో సేవలు చేస్తున్నాను, నేను ప్రజాక్షేత్రంలో ఉండాలనుకుంటున్నానని స్పష్టం చేశారు.

ఖమ్మం, సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నుండి అప్లై చేసుకోవడం జరిగింది. ప్రజాస్వామ్య వాతావరణ ఉన్న పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీయే అన్నారు. నేను పోటీ చేసేందుకు నాకు అన్ని అర్హతలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ నమ్ముతుందని అనుకుంటున్నానని వెల్లడించారు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్.

Read more RELATED
Recommended to you

Latest news