నంది పురస్కారాన్ని గద్దర్‌ అవార్డుగా మారుస్తూ.. సీఎం రేవంత్ కీలక ప్రకటన

-

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సినీ ప్రముఖులకు ఇచ్చే నంది అవార్డుల స్థానంలో ఇక నుంచి గద్దర్ పేరిట అవార్డులు ఇస్తామని ప్రకటించారు. ఇటీవల కాలంలో సినీ ప్రముఖులు కలిసి నంది అవార్డులను పునరుద్ధరించాలని కోరగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. వచ్చే ఏడాది నుంచి గద్దర్ జయంతి రోజున ఈ పురస్కారాలు ప్రదానం చేస్తామని వెల్లడించారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన గద్దర్ జయంతి వేడుకల్లో ఈ కీలక ప్రకటన చేశారు.

పేద, బడుగు బలహీనవర్గాల ప్రజల అభివృద్ధే ధ్యేయంగా గద్దర్‌ జీవన ప్రయాణం సాగిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో ఆయన కృషి చిరస్మరణీయమని గుర్తు చేశారు. గద్దర్‌ స్ఫూర్తితోనే రాష్ట్రంలో ప్రజాపాలన సాగుతుందని తెలిపారు. అందుకు నిదర్శనమే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అసెంబ్లీలో జ్యోతిరావు పూలే ఏర్పాటు చేయాలని సభాపతికి వినతి పత్రం ఇవ్వడం అని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో గద్దర్ అంతరంగాన్ని స్పష్టీకరిస్తూ రచించిన పాటకు జీవకణం, తరగని గని అనే రెండు పుస్తకాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు.

Read more RELATED
Recommended to you

Latest news