హైదరాబాద్ ప్రజలు దయచేసి బయటకు రావొద్దని జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి కోరారు. భారీ వర్షాల నేపథ్యంలో జిహెచ్ఎంసి అధికారులను అప్రమత్తం చేశారు నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి. లోతట్టు ప్రాంతాల్లో డి ఆర్ ఎఫ్ టీం లు అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు.
శిధిలావస్థలో ఉన్న భవనాలలో ఉన్న వారిని తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఆదేశించారు. అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న చోట ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు. అవసరం అయితేనే బయటకు వెళ్లాలని నగర వాసులకు విజ్ఞప్తి చేశారు జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి.
కాగా, హైదరాబాద్ వ్యాప్తంగా రాత్రి నుంచి ఏకదాటిగా వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట, బోరబండ, కూకట్పల్లి, మాదాపూర్, ఫిలింనగర్ తదితర ప్రాంతాల్లో వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చాలాచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. GHMC పరిధిలో సాయం కోసం 9000113667 నంబర్ ని సంప్రదించాలని అధికారులు సూచించారు.