ఎడిట్ నోట్: బాబు..ముందు నుయ్యి..వెనుక గొయ్యి.!

-

అధికారం అనేది ఏ రాజకీయం పార్టీకైనా అతి పెద్ద టార్గెట్..అధికారంలో ఉంటేనే రాజకీయంగా ఏదైనా చేయవచ్చు..అలాగే పార్టీ బలంగా ఉండాలన్న అధికారం అనేది ముఖ్యం. ఇక ఏపీలో ప్రతిపక్ష టి‌డి‌పికి అధికారంలోకి రావడం అనేది జీవన్మరణ సమస్యగా మారిపోయింది. ఇప్పటికే ఓటమి వల్ల పార్టీ చాలా వరకు నష్టపోయింది. జగన్ దెబ్బకు పార్టీ అడ్రెస్ గల్లంతయ్యే ప్రమాదంలో ఉంది. ఇక ఇంకోసారి కూడా ఓటమి పాలైతే..ఆ పార్టీ మనుగడకే ప్రమాదం.

అందుకే ఈ సారి ఎలాగైనా గెలవాలని చెప్పి టి‌డి‌పి అధినేత చంద్రబాబు కష్టపడుతున్నారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి పలు రకాల వ్యూహాలతో ముందుకెళుతున్నారు. అయితే ఇక్కడ టి‌డి‌పికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. గత ఎన్నికల్లోనే ఒంటరిగా బరిలో దిగి చావు దెబ్బతింది. ఈ సారి కూడా అలాగే ముందుకెళితే రిస్క్ తప్పదు. అందుకే పవన్ తో పొత్తు కోసం బాబు ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో బి‌జే‌పి మద్ధతు అనేది కూడా కావాలి. కేంద్రంలో అధికారంలో ఉన్న బి‌జే‌పి మద్ధతు ఇస్తే..ఎన్నికల సమయంలో కాస్త అనుకూలంగా అధికార వ్యవస్థ ఉంటుంది.

ఇక్కడ వరకు బాగానే ఉంది..కానీ ఇప్పుడే అసలు సమస్యలు మొదలైంది. టి‌డి‌పి-బి‌జే‌పి-జనసేన పొత్తు ఉండే అవకాశాలు ఉన్నాయని పవన్ చెప్పారు. కాకపోతే అధికారంలోకి వచ్చాక అప్పుడు పార్టీల బలాబలాలని బట్టి సి‌ఎం అభ్యర్ధిని నిర్ణయిస్తామని అన్నారు. ఇదే ఇప్పుడు టి‌డి‌పి శ్రేణుల ఆగ్రహానికి కారణమైంది. 8 శాతం ఓట్లు ఉన్న జనసేన..40 శాతం ఓట్లు ఉన్న టి‌డి‌పికి సి‌ఎం సీటు విషయంలో కండిషన్స్ పెట్టడం ఏంటి అని అంటున్నారు.

అలాగే ఏపీలో బి‌జే‌పికి బలం శూన్యం..పైగా ఆ పార్టీపై వ్యతిరేకత ఉంది. ఈ సమయంలో బి‌జే‌పితో కలిసి వెళితే టి‌డి‌పికే నష్టం..అటు బి‌జే‌పికి లాభం. అసలు ఎన్నికలు సి‌ఎం అభ్యర్ధి అంశంపైనే ఎక్కువ జరుగుతాయి. అటు జగన్, ఇటు చంద్రబాబు అన్నట్లే పోరు ఉంటుంది. అలాంటప్పుడు ఎన్నికల తర్వాత సి‌ఎం అభ్యర్ధి చెబుతామని అంటే..ప్రజలు కన్ఫ్యూజ్ అవుతారు. నిలకడ లేని నాయకత్వం ఎందుకు అని అనుకుంటారు. అప్పుడు జగన్ వైపే మొగ్గు చూపుతారు. అంటే ఎటు చూసుకున్న బాబుకు పెద్ద తలనొప్పి ఉంది.

పొత్తు ఉంటే ఒక బాధ, లేకపోతే మరొక బాధ. ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు బాబు పరిస్తితి తయారైంది. మరి ఇప్పుడు బాబు ఎలా ముందుకెళ్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news