కామారెడ్డి నుంచే సీఎం కేసీఆర్ పోటీ చేస్తారని కామారెడ్డి బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సంచలన ప్రకటన చేశారు. సీఎం కేసీఆర్ ను కామారెడ్డిలో పోటీ చేయాలని నేనే మూడు సార్లు కోరానని…సీఎం కేసిఆర్ వంద శాతం కామారెడ్డిలోనే పోటీ చేస్తారని వెల్లడించారు.
ఒక సామాన్య కార్యకర్తగా కేసిఆర్ ను గెలిపిస్తానని.. నేను ఏం చేయాలో కేసిఆర్ నిర్ణయిస్తారని వెల్లడించారు. సీఎం కేసిఆర్ సొంత గ్రామం కామారెడ్డి నియోజక వర్గంలోనే ఉంటుందని.. మిడ్ మానేరులో వారి గ్రామం మునిగితే వారి కుటుంబం చింత మడక వెళ్లిందని చెప్పారు. కాగా, ప్రస్తుతం సీఎం కేసీఆర్.. గజ్వేల్ ఎమ్మెల్యే పని చేస్తున్న సంగతి తెలిసిందే.