నగరంలో గణేష్ ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇప్పటికే అనేక వినాయక విగ్రహాలు నిమర్జనం అయ్యాయి. ఇక ఈ నెల 17న ఖైరతాబాద్ మహాగణపతి తో పాటు పెద్ద సంఖ్యలో వినాయక విగ్రహాలు నిమర్జనాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గణేష్ నిమజ్జనం రోజున మెట్రో రైల్ లో సర్వీసు సమయాన్ని పొడిగించారు అధికారులు.
అదనపు రద్దీని దృష్టిలో ఉంచుకొని అన్ని స్టేషన్లలో చివరి మెట్రో రైలు సెప్టెంబర్ 17న తెల్లవారుజామున ఒంటిగంటకు బయలుదేరుతుంది. ఈ నెల 17న పెద్ద ఎత్తున గణపతి నిమర్జనోత్సవం జరగనున్న నేపథ్యంలో అర్ధరాత్రి రెండు గంటల వరకు మెట్రో రైళ్లు నడపాలని నిర్ణయించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. మెట్రో లైన్ లోని ప్రతి స్టార్టింగ్ స్టేషన్ నుంచి రాత్రి ఒంటిగంటకు చివరి రైలు బయలుదేరుతుందని తెలిపింది.
నిమర్జనం ముగిసే వరకు అవసరాన్ని బట్టి అదనపు రైలు కూడా నడిపిస్తామని మెట్రో రైలు సంస్థ స్పష్టం చేసింది. మెట్రో రైలు, స్టేషన్లలో ప్రతిరోజు 5 లక్షల మంది ప్రయాణికులు భారీగా తరలివస్తున్నారు. వారిలో ఎక్కువమంది గణేష్ చతుర్థి పండుగ సందర్భంగా ప్రయాణిస్తున్న వారే కావడం గమనార్హం. దీంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.