తెలంగాణను ఆంధ్రాలో కలిపే కుట్ర జరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ లో భారీ చేరికలు చోటు చేసుకున్నాయి. కొత్తపల్లి మండలంలోని పలు గ్రామాల యువతను పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి గంగుల. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ పాలనలో వలసలు తగ్గిపోయాయన్నారు. ఆంధ్రా ముసుగులో లిడర్లు వస్తున్నారు, నమ్మవద్దని కోరారు.
యువత భవిష్యత్తు బాగుండాలంటే కెసిఆర్ రావాలని కోరారు. కాంగ్రెస్ బిజెపి పాలకులు ఆంధ్రాలో కలుపుతారని.. కరీంనగర్ ఇంకా అభివృద్ధి చెందాలంటే మరొక అవకాశం ఇవ్వండని వెల్లడించారు. డబుల్ ఇంజన్ అంటే ముఖ్యమంత్రి కెసిఆర్, కరీంనగర్ లో ఎమ్మెల్యే గంగుల ఉండాలని స్పష్టం చేశారు. పదమూడు నియోజకవర్గాలలో బిఆర్ఎస్ జెండా ఎగురుతుంది..కెసిఆర్ లేని తెలంగాణ ని ఊహించుకొనే పరిస్థితి లేదన్నారు. కెసిఆర్ లేని తెలంగాణ ఆంటే నెర్రలు వారిన తెలంగాణనే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.