బాసర ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం!

-

బాసర ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం రేపుతోంది. నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో క్యాంపస్‌లో హాస్టల్ భవనం టెర్రస్ పైన గంజాయి తాగుతూ ఇద్దరు విద్యార్థులు సెక్యూరిటీ సిబ్బందికి పట్టుబడ్డారు. వారి తల్లితండ్రులను పిలిపించి విద్యార్థులను ఇంటికి పంపించినట్లు సమాచారం. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Ganja riot in Basra Triple IT

ఇక అటు గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు…కొనసాగుతోంది. వివేకానందకు సయ్యద్ అబ్బాస్ అలీ పదిసార్లు డ్రగ్స్ సరఫరా చేసినట్టు గుర్తించారు పోలీసులు..నిన్న సయ్యద్ అబ్బాస్ ఆలీ ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. సయ్యద్ అబ్బాస్ అలీ, వివేకానంద, కేదార్ ముగ్గురు సెల్ ఫోన్స్ సీజ్ చేసిన గచ్చిబౌలి పోలీసులు..ముగ్గురు సెల్ ఫోన్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. సెల్ ఫోన్స్ లో డేటాను,మెసేజ్ లు, వాట్సప్ చాట్ ని రీట్రైవ్ చేస్తే మరింత సమాచారం పోలీసులకు అందనుంది. అటు కేదార్ పబ్బుల్లో డ్రగ్స్ పార్టీలు జరిగినట్టు అనుమానిస్తున్నారు గచ్చిబౌలి పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news