దేశ ప్రజలకు బిగ్ అలెర్ట్. ఇవాళ దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం జరగనుంది. పోలియో వ్యాధి నిర్మూలన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఇవాళ అంటే మార్చి మూడవ తేదీన దేశవ్యాప్తంగా 0-5 సంవత్సరాలు లోపు పిల్లలకు పోలియో చుక్కల కార్యక్రమాన్ని నిర్వహించనుంది. సమీపంలోని ఆరోగ్య కేంద్రం లేదా పోలియో కేంద్రం వద్ద మీ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాయి.
ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల మూడో తేదీ అంటే ఇవాల్టి నుంచి 5వ తేదీ వరకు ఏకంగా మూడు రోజులపాటు పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మూడు రోజుల్లో ఎప్పుడైనా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని అధికారులు సూచించారు. ఇతర ఊర్లకు వెళ్లిన, ఫంక్షన్లకు వెళ్లిన, ప్రతి ప్రాంతంలో అలాగే ప్రతి బస్టాండ్ లో కూడా పల్స్ పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఇలాంటి ఇబ్బందులు లేకుండా వాటిని వినియోగించుకోవాలని కోరారు.